కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతలు బుధవారం క్రీడా దుస్తులు వితరణ చేశారు. వాల్మీకిపురం మండలం కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11వ తేదీ నుంచి ఎస్.జి.యఫ్ క్రీడలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ క్రీడల్లో పాల్గోంటున్న 20మంది విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పీలం నాగేంద్ర ,పీలం లక్ష్మీ నారాయణ మరియు కోల్ల కిరణ్‌కుమార్ లు కలిసి వారి తల్లిదండ్రుల చేతులు మీదుగా 20 జతల క్రీడా దుస్తులను వితరణ చేయగా ప్రధానోపాధ్యాయులు వి.ప్రకాష్, స్కూల్ కమిటీ చైర్మన్ హరినాథ్ పంపిణీ చేశారు