శ్రీకాకుళం పట్టణంలోని శివారు ప్రాంతాలైన తిలక్ నగర్, గోవింద నగర్, ఎస్బిఐ కాలనీ తదితర ప్రాంతాలను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. ఇటీవల ఏర్పడిన అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. అధికారులతో మాట్లాడి తక్షణమే కాలనీలో నిలిచిన వర్షపు నీటిని తొలగించి, సమస్యను పరిష్కార దిశగా అధికారులకు ఆయన ఆదేశించారు. చిన్నపాటి వర్షానికి అయిన రోడ్లపైకి నీరు చేరుతుందని స్థానికులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన స్పందించి సమస్య శాశ్వత పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.