దేవరకద్ర మండల కేంద్రంలో వెలసిన ఈశ్వర వీరప్పయ్య స్వామి బ్రహ్మోత్సవాలు కనపడుతున్నాయి. సందర్భంగా గురువారం ఉదయం 7 గంటలకు ఆలయ అర్చకులు నాగరాజా చారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలతో అందంగా అలంకరణ చేశారు. ఈనెల 13వ తేదీ నుండి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంలో ఆరు రోజులపాటు అఖండ భజన కార్యక్రమం కొనసాగుతుంది. బ్రహ్మ చాలా భాగంగా గురువారం స్వామివారికి బ్రహ్మోత్సవం ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.