ఉల్లి రైతులను ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని, గత మూడు రోజులుగా కర్నూలు మార్కెట్ యార్డు లో రైతుల నుండి 4817 క్వింటాళ్ల ఉల్లిని మార్క్ ఫెడ్ ద్వారా క్వింటాల్ రూ. 1200 లతో కొనుగోలు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత తెలిపారు.మంగళవారం కర్నూలు మార్కెట్ యార్డ్ లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు.. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు..ఉల్లి రైతులు నష్టపోకుండా ఉద్యాన,మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోతున్న ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలన