Araku Valley, Alluri Sitharama Raju | Aug 21, 2025
ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయతీ పరిధిలో హంసబండ సమీపంలో గురువారం సాయంత్రం వాహన ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మొక్కలు పంపిణీ చేసే వాహనం హంసబండ సమీపంలో గల పెట్పూలేడి ఘాట్ వద్ద రహదారి పై ఉన్న పశువులు, మేకలను ఢీ కొని బోల్తా పడింది. ఈ ఘటనలో హంసబండ గ్రామ రైతులకు చెందిన 3 ఆవులు, 9 మేకలు మృతి చెందాయి. వాహనంలో గల మనుషులకు గాయాలు ఏమీ కాలేదు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.