మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం.కళ్యాణ లక్ష్మి&సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఇల్లందు శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య,బయ్యారం.మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, గ్రామ పరిధిలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పరిశీలించాలన్నారు. అలాగే యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతుందని అన్నారు. అంతే కాకుండా విధులు సక్రమంగా నిర్వహించని పలు శాఖల అధికారులపై, ఆగ్రహం వ్యక్తం చేశారు