తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన హుండీ లెక్కింపు కార్యక్రమం సాయంకాలం వరకు జరిగింది, వాటి వివరాలు ఆలయ కార్యవాహణాధికారి బాపిరెడ్డి మరియు ఆలయ ఏఈఓ తెలిపిన వివరాల మేరకు మొత్తం నగదు ఒక కోటి 82 లక్షల 1785 రూపాయలు బంగారం 58 గ్రాములు వెండి 510 కిలోల 600 గ్రాములు విదేశీ నగదు మొత్తం 265 ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవాహణాధికారి బాపిరెడ్డి ఆలయ ఏఈఓ మోహన్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు