ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేట మండలంలో పర్యటించిన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అభినందించారు.సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంలో పోలీసుల సమిష్టి కృషి, సమన్వయం, అంకితభావం ప్రధాన పాత్ర వహించాయని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు చేయడం ప్రశంసనీయమన్నారు.భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహం, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ పోలీసు సిబ్బందిని పిలుపునిచ్చారు.