ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పించా డ్యాం లో వరుసగా నీరు చేరుతోంది. ప్రస్తుతం డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉంది.డ్యాం నీటి స్థితి ఇలా ఉంది: Inflow–Outflow 180 క్యూసెక్కులు, నీటి మట్టం 1000.00 అడుగులు, సామర్థ్యం 327.60 ఎంసీఫ్ట్.ఎఈఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బి. నాగేంద్ర నాయక్ సూచించారు – డ్యాం గేట్లు తెరవబడి ఉన్నందున, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈత కొట్టడం, మోటార్ వినియోగించడం, పశువులు మేపడం వంటివి తక్షణం నివారించాలని సూచించారు.