పత్తికొండ-ఎమ్మిగనూరు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని జూటూరు గ్రామస్థులు శుక్రవారం తెలిపారు. పత్తికొండ మండలం జూటూరుకు ఆనుకొని ప్రవహిస్తున్న నల్ల వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు, ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి అంతరాయం కలిగిందన్నారు. కాగా, గురువారం రాత్రి కురిసిన వర్షానికి నల్ల వంక పొంగి ప్రవహిస్తోంది. సర్పంచ్ జయ శ్రీ, టీడీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, శంకర్ రెడ్డి వంక ఉద్ధృతిని పరిశీలించారు.