ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మధ్య రోడ్డు అధ్వానంగా ఉందని వాహనదారులు వాపోయారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షం పడినప్పుడు ఆ గుంతలు కనపడక వాహనదారులు పలుసార్లు కిందపడి గాయాలైన సంఘటన కూడా చోటు చేసుకుంది అన్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా పలు గ్రామాలలో సిసి రోడ్లు తారు రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నూతన రోడ్ ఏర్పాటు చేయాలని కోరారు.