జిల్లాలోని పలు MDU ఆపరేటర్ ల పై రేషన్ సరుకులు డెలివరీ సమయములో సరుకుల ధర కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని, రేషన్ సరుకులు ఇవ్వడంలేదని అందుతున్న ఫిర్యాదులను దృష్టి లో ఉంచుకొని అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామనిఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్ నాగంజనేయులు హెచ్చరిక జారీ చేశారు శుక్రవారం సాయంత్రం జిల్లాలోని ఎండిఓ ఆపరేటర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి నిబంధనలో పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.