గాజువాక లంక మైదానంలో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర గణపతిని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ శక్తిని తెలియజేస్తూ లక్ష చీరలతో అతి ఎత్తైన వినాయకుని తయారుచేయటం గర్వకారణమని అలాగే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఏర్పాటు చేసిన వినాయకుడిని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్న సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలను కమిటీ సభ్యులకు తెలిపారు.