భీమవరంలోనే జిల్లా కలెక్టరేట్ ఉండాలంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం మధ్యాహ్నం 1:30కు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కలెక్టరెట్ తరలింపుపై జరుగుతున్న సంఘటనలపై అఖిల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరం నుంచి కలెక్టరేట్ తరలించకూడదని పలువురు అన్నారు. కలెక్టరేట్కు కావాల్సిన స్థలాలు, వనరులపై పలువురు ఈ సమావేశంలో ప్రస్తావించారు.