మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో బుధవారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ చేశారు. బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆ మహాయోధుడు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గంగా గౌడ్, పొన్నం సురేందర్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, రమణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నర్సాగౌడ్, రత్న గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు