జిల్లా కలెక్టర్ పేదల పక్షాన నిలబడి కొంత సమయం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని ఐక్యవేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ...కర్నూలు నగరంలోని ప్రభుత్వ క్వార్టర్స్ ఏ, బి, సి బ్లాకుల్లో కొంతమంది పేదలు నివసిస్తున్నారని, వారిని ఒక్కసారిగా ఖాళీ చేయమని చెబితే ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కలెక్టర్, జిల్లా అధికారులు స్పందించి పేదలకు కొంత గడువు ఇవ్వాలని కోరారు.అదేవిధంగా అక్కడ కొంతమంది అక్రమార్కులు పాతికపోయి రాజకీయ పలుకుబడితో దందాలు