ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం స్వామి అమ్మవార్ల పవిత్రోత్సవాలు సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేద, దివ్యప్రబంద పారాయణం ప్రారంభం, ద్వారతోరణం ద్వాజకుభరాధన, మహాకుభారాధన, చక్రజ్జమండల, అగ్ని ప్రతిష్ఠ, విశేషమోమాదులు, శ్రీ వార్లకు స్నపన తిరుమంజనం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.