సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎం ఆర్ హెచ్ ఎస్ వ్యవస్థాపకులు జార్జ్ బి గార్డెన్ దొర 33వ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని అల్లిపూర్ లోని గార్డెన్ నగర్ లో గార్డెన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గార్డెన్ దొర ఎంఆర్హెచ్ఎస్ నెలకొల్పి ఎంతో మంది పేద ప్రజలకు విద్యను అందించారన్నారు. జహీరాబాద్ లో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పలువురు క్రైస్తవ సోదరులు, పాస్టర్లు ఉన్నారు.