మైదుకూరులో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ ఎరువుల దుకాణాలను గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. యూరియాను నిలువ ఉంచి కృతిమ కొరత చూపితే చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ధరలకు యూరియా అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు మోతాదులో వాడాలని తెలిపారు. రైతులు పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయగానే రసీదు పొందాలన్నారు.