ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం భూసిమెట్టలోని ఆదివాసీ గిరిజన కాలనీలో వర్షపు నీరు, పంట కాలువ నీరు ప్రజల ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నీరు నిలిచిపోవడంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై స్పందించని గ్రామ, మండల పంచాయతీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.