అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు సాధించిన ఎంపీకి రైతుల అభినందనల వెల్లువెత్తాయి. శనివారం మూడు గంటలకు ఏలూరు శాంతి నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంకు వందలాదిగా తరలివచ్చిన పొగాకు, పామాయిల్ రైతులు ఎంపీని కలిసి తమ సమస్యలపై వినతలు సమర్పించారు.ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సీఎం చంద్రబాబు చొరవతో పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. రైతుల ఇబ్బందులపై పలుమార్లు తాను పార్లమెంట్లో లేవనెత్తానన్నారు