కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణ నాయి బ్రాహ్మణులు గురువారం కటింగు షాపులు మూసివేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి తమ జీవన వృత్తి అయిన కటింగ్ షాపులకు వేరే కులస్తులైన అట్లూరు మండలానికి చెందిన వారు పోరుమామిళ్లలో కటింగ్ షాప్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. దీనితో తమ వృత్తికి ఆటంకం కల్గి తమ కుటుంబాలను రోడ్డున పాలు చేస్తున్నారంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు మెమోరాండం అందజేశామన్నారు.