Araku Valley, Alluri Sitharama Raju | Sep 13, 2025
డుంబ్రిగుడ మండలంలోని కోసంగి గ్రామ శివారులో మేకలును మేతకు తీసుకెళ్లిన మహిళపై కందిరీగలు శనివారం సాయంత్రం దాడి చేశాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మట్టం ఇచ్చామ్మ అనే మహిళకు గాయాలైయ్యాయి. మేకలు మేత కోసం వెళ్తుండగా అకస్మాత్తుగా కందిరీగలు విరుచుకుపడి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమెను హుటాహుటిన వైద్యనిమితం డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.