బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామంలో మామిడి రైతులకు ఉద్యాన శాఖ అధికారిని బి దీప్తి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి మాట్లాడుతూ, మామిడి పంటలు అధిక దిగు వాళ్ళు సాధించడానికి రైతులు మేలైన యాజమాన్య పద్ధతిలో పాటించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో గజపతినగరం ఏం సి చైర్మన్ పి.వి. గోపాలరాజు బొండపల్లి మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు ఏఈఓ సంతోష్ మామిడి రైతులు పాల్గొన్నారు.