శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని న్యూ అమీన్ నగర్ లో సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన రాజ్యసభ సభ్యుడిగా సిపిఎం అగ్ర నేతగా అందించిన సేవలను కొనియాడారు.