కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం 4వ రోజు శ్రీ కామాక్షి దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి సుప్రభాత సేవ, మహాగణపతి పూజ,చండీ పారాయణం మహా నివేదన, మహా మంగళహారతి పూజల అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాధుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.