పాండ్రంగి జంక్షన్ కి దగ్గరలో సోమవారం ఉదయం పాఠశాల బస్ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయల పాలయ్యారు. ఈ ఘటపై బాధిత విద్యార్థి తండ్రి కనకల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పద్మనాభం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పద్మనాభం సీఐ శ్రీధర్ పరామర్శించి ప్రమాద వివరాలపై విచారణ చేసారు.