నేరచరిత్ర కలిగిన రౌడీషీటర్లు ఇకమీద సత్ప్రవర్తన కలిగి ఉండాలని వేంపల్లె సీఐ టి.నరసింహులు అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు ఆయన కౌన్సిలింగ్ చేశారు. జీవితంలో మార్పు రావాలని, చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా మెలగాలని హెచ్చరించారు. పదేపదే కేసుల పాలవుతూ రౌడీషీటర్లుగా నమోదు అయి జీవితాలను అంధకారం చేసుకోవద్దన్నారు.