రేణిగుంట: శిర్డీ యాత్రలో ఒకరి మృతి రేణిగుంట మండలం గుత్తివారిపల్లె గ్రామానికి చెందిన మునిరాజారెడ్డి(49) శిర్డీలో గురువారం మృతిచెందారు. డయేరియాతో బాధపడుతున్న ఆయన భక్తులతో కలిసి మంగళవారం శిర్డీ వెళ్లారు. యాత్రలో విరేచనాలు ఎక్కువై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి గుత్తివారిపల్లి గ్రామానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు.