సీపీఎం నాయకులు ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సామ్రాజ్య వాద అమెరికా తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమెరికా పెత్తందారులు మన దేశాన్ని అవమానిస్తూ ప్రకటనలు చేస్తున్న మోడీ ప్రభుత్వం నోరు మెదక పోవడం బాధాకరం అన్నారు. అమెరికా నిరంకుశ విధానాల వల్ల ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.