ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలుడు మృతి చెందిన ఘటన గురువారం నిర్మల్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్ఐ లింబాద్రి వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన జయరాజ్ (12) తన తల్లి కూలికి వెళ్ళగా తోడుగా వెళ్లాడని, అదే సమయంలో ప్రమాదవశాత్తు ఆడుకుంటూ కాల్వలో పడిపోయి మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నమన్నారు.