వినాయక చవితి పండుగ, గణేష్ నిమజ్జనం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. పై అధికారుల ఆదేశాల మేరకు సీఐ కత్తి శ్రీనివాసులు శనివారం ఉదయం బంగారు పాల్యం మండలంలోని టేకుమంద గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సిబ్బందితో కలిసి గ్రామంలోని అనుమానాస్పద ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేశారు. గ్రామంలో గుర్తింపు పొందిన ట్రబుల్ మేకర్స్, రౌడీ షీటర్లు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలాగే ఇళ్లలో, వీధులలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామసభ నిర్వహించిన వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను శాంతియుతంగా, భక్తి పూర్వకంగా జరుపుకోవాలన్నారు.