లింగ వివక్ష, కిషోరీ వికాసం, పోషణ ఆరోగ్యంపై డి.హిరేహాల్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమారాణి, ఇన్చార్జ్ హెచ్ ఎం అమరవాణి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా విద్యా ప్రాముఖ్యత, మహిళా చట్టాలు, సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు వల్ల కలిగే అనర్థాలపై వివరించారు.