నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసేందుకు పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొనాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావాలని కోరారు