ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను ఆదివారం మధ్యాహ్నం జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏసి కళాశాల, టీజేపీఎస్ కాలేజీ మరియు విజ్ఞాన్ నిరూల డిగ్రీ & పీజీ కాలేజీలలోని పరీక్షా కేంద్రాల్లో జరిగిన స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పరిశీలించారు.