జనగామ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో గురువారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంట సమయంలో ఓ ఇంట్లో తాళం పగల కొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.అర్ధ తులం బంగారం,37 తులాల వెండి అపహరించారు.గ్రామానికి చెందిన బాల ప్రమీల అనే మహిళ అదే గ్రామంలోని తన మేనమామ ఇంటికి వెళ్ళగా ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు