కడప జిల్లా కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష నివాస కార్యాలయంలో ఆదివారం ఆయనను గల్ఫ్ కన్వీనర్ మరియు కడప నార్త్ జోన్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన షేక్ ఉమైర్ కలసినట్లు నాయకులు తెలిపారు. మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా ఉమైర్ కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చాక్లెట్ గౌస్, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దేవి రెడ్డి ఆదిత్య,కార్పొరేటర్ జిలాన్, తదితరులు పాల్గొన్నారు.