గ్రామాలాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని డీఈవో శ్యామ్యాల్ పాల్ అన్నారు. శనివారం హాలహర్వి మండలం సిద్ధాపురంలో పల్లెకు పోదాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్య, ఆరోగ్యం, ఇళ్లు, ఉపాధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులతో ప్రత్యే కంగా సమావేశం నిర్వహించి వివిధ అంశాలతో మాట్లాడారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.