వసతి గృహం సందర్శన తిరుపతి: రేణిగుంట బీసీ వసతి గృహాన్ని ఎంపీడీవో ప్రభువురావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభ్రత, ఆరోగ్య భద్రతపై ప్రాముఖ్యత వివరించారు. పరిశుభ్ర వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం వసతి గృహ ఆవరణలో ఉన్న చెత్త, మురుగు సమస్యలను గమనించిన ఆయన వెంటనే పంచాయతీ కార్మికులను ఆదేశించి శుభ్రపరిచే పనులు చేపట్టించారు.