పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం కావూరు మార్గంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దర్నీ ఎస్సై పుల్లారావు తన సిబ్బందితో పట్టుకున్నారని రూరల్ సీఐ సుబ్బా నాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మాలిక్ బెహరా స్పిన్నింగ్ విలువలో పనిచేస్తూ అక్రమంగా గంజాయి రవాణా చుట్టుపక్కల ఏరియాలో కార్మికులకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 700 గ్రాముల గంజాయి 400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.