రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. కోడూరు చెరువు పైభాగంలో ఐదేళ్ల తర్వాత 1500 ఎకరాలు సాగులోకి వచ్చాయాని అయన అన్నారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరు చెరువు పైభాగంలో సన్నకారు రైతులు సాగు చేసిన పొలాలను అయన పరిశీలించారు. ఎన్టీఆర్, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పుణ్యాన మనకు 78 టీఎంసీల సామర్ధ్యమున్న సోమశిల జలాశయం ఉందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ చెరువు నిండా నీళ్లు పెట్టి 1500 ఎకరాల్లో పంట లేకుండా చేశారని ఆదివారం సాయంత్రం 5 గంటలకు మండిపడ్డారు