ప్రతి గ్రామంలో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా వెల్లడించారు. గురువారం ఒంటిగంటకు మండలంలోని సైదిపూర్ గ్రామంలో నూతన రేషన్ దుకాణాన్ని ఏ ఎం సి చైర్మన్ ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ప్రతి కార్డుదారుడు ఇక నుండి నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులో ప్రభుత్వం అందించే సరుకులను తీసుకోవాలని సూచించారు. వర్ని తహసీల్దార్ సాయిలు, మాజీ జెడ్పిటిసి రనజా నాయక్, బాబు, రూప్ల, కిషన్, బంజారా రెడ్డి ,హరినాయక్, నరేందర్, శివ, చందర్ పాల్గొన్నారు.