అనంతపురంలో ఈనెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ జరుగునుందని అందరూ హాజరై జయప్రదం చేయాలని ముఖ్యమంత్రి పర్యటన అబ్జర్వర్ కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. కంబదూరు, కుందుర్పి మండల కేంద్రాల్లో సోమవారం టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా బహిరంగ సభ జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తప్పనిసరిగా బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ కంబదూరు, కుందుర్పి మండలాల ఇన్చార్జ్ ధర్మతేజ పాల్గొన్నారు.