నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బుధవారం రాత్రి ఎస్సై మల్లికార్జున్రెడ్డి విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వల్ల ఉపయోగాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, అత్యవసర నెంబర్లు, ఫోక్సొ చట్టాలు, సైబర్ నేలలపై విద్యార్థులకు వివరించారు. చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో రాణించాలని ప్రేమ పేరుతో ఆకర్షణ పేరుతో చదువుకో దూరం కావద్దని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చి ఉన్న స్థానాలకు వెళ్లాలని ఎస్సై మల్లికార్జున రెడ్డి బాలికలకు సూచించారు.