ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారానే ఆరోగ్యంగా ఉండవచ్చని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఫోన్ల నుంచి దూరం చేసి, ఆటల వైపు మళ్ళించాలని తల్లిదండ్రులకు సూచించారు.