జిల్లాలో గణేష్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రజలందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గల పెద్దవాగు వద్ద గణేష్ నిమజ్జన స్థలాన్ని రెవెన్యూ, పోలీస్,మున్సిపల్,విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.గణేష్ నిమజ్జన ప్రదేశం వద్ద మట్టి చదును చేయాలని, అవసరమైన చోట గుంతలను పూడ్చివేయాలని, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జనం జరిగే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అవసరం మేరకు జనరేటర్ లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.