నల్లగొండ జిల్లా:అక్రమంగా గంజాయి విక్రయించడంతోపాటు సేవిస్తున్న ఆరుగురు నిందితులను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.శనివారం డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ కు చెందిన సౌగంధ,కరణ్ కుమార్ బాధలాపురం సమీపంలోని రైస్ మిల్లులో పనిచేస్తున్నారు.వీరికి మిర్యాలగూడ పట్టణం లోని గాంధీ నగర్ కు చెందిన కుక్కల వంశీ దైద జగదీష్ తాళ్లగడ్డకు చెందిన షేక్ హైమద్ జంపాల నిఖిల్ పరిచయం అయ్యారు.6 కలిసి గంజాయి సేవించడంతోపాటు అక్రమంగా బీహార్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో ఎక్కువ ధరకు గంజాయి విక్రయిస్తున్నారన్నారు.