సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయం వద్ద బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల బిజెపి అధ్యక్షులు దుర్గయ్య ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు గురువారం మధ్యాహ్నం గ్రామాల్లో రోడ్లు, సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.