నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సుమారు 200కు పైగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయకులు కొలువుదీరాయి. నాలుగు రోజుల ప్రత్యేక పూజలు అనంతరం ఐదవ రోజు ఆదివారం నిమజ్జనం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, ఆర్డీవో నరసింహులు హాజరై విగ్రహాలకు పూజలు చేసి కదిలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు