వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బజార్ వాడిలోని వినాయకుడి వద్ద ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు గణేష్ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఏఎస్పీతో పాటు పట్టణ సిఐ బాలాజీ వరప్రసాద్ గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు.